తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈనెల 28 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో, అలంపూర్ మున్సిపాలిటీలోని ఐదవ వార్డ్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న బోరవెల్లి సత్యనాగేష్, ఈ ఎన్నికలలో అలంపూర్ మున్సిపాలిటీలో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.