మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, డబ్బు తరలింపుపై పోలీసులు నిఘా పెంచారు. అలంపూర్ మున్సిపల్ పరిధిలో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ తనిఖీలలో సీఐ, కానిస్టేబుల్స్ కూడా పాల్గొన్నారు.