రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో వార్డు సభలు గురువారం నిర్వహించారు. నాలుగో వార్డులో స్థానిక కౌన్సిలర్ ఈరమ్మ మద్దిలేటి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. వార్డు కౌన్సిలర్ ప్రజల అర్జీలను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ షేక్షావలి, స్థానికులు పాల్గొన్నారు.