జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ, ఆర్టీవో అధికారులు సంయుక్తంగా 2K వాకథాన్ నిర్వహించారు. పాలమూరు యూనివర్సిటీ నుండి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పీయూ వైస్ ఛాన్సలర్, అదనపు ఎస్పీ పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని, యువత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని వైస్ ఛాన్సలర్ అన్నారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం ప్రాణ రక్షణకు దోహదపడతాయని, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ వంటివి ప్రాణాంతకమని అదనపు ఎస్పీ హెచ్చరించారు.