మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ,
భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విజ్ఞప్తి మేరకు బుధవారం సాయంత్రం NHAI ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గతంలో NH44 నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులే మరోసారి తమ భూములను కోల్పోతున్నారని వాపోయారు. రైతులు భూములు కోల్పోకుండా, అటవీ భూముల మీదుగా
భారత్ మాల అలైన్మెంట్ మార్చే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలైన్మెంట్ మార్పుపై సర్వే నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని NHAI అధికారులు హామీ ఇచ్చారు.