భూత్పూర్: మున్సిపల్ ఎన్నికల తొలిరోజు ఒకే నామినేషన్

704చూసినవారు
భూత్పూర్: మున్సిపల్ ఎన్నికల తొలిరోజు ఒకే నామినేషన్
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను నామినేషన్ల తొలిరోజైన బుధవారం కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైందని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే తన దరఖాస్తును సమర్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల నుంచి ఇప్పటివరకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్