పాలమూరులో నీటి కష్టాలకు చెక్.!

434చూసినవారు
పాలమూరులో నీటి కష్టాలకు చెక్.!
మహబూబ్‌నగర్ పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ. 220 కోట్ల భారీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం రాత్రి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తూ, పట్టణంలో 14 కొత్త నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. ఈ ట్యాంకుల ద్వారా 1860 కిలో లీటర్ల అదనపు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్ ప్రజలకు నిరంతరాయంగా, సమృద్ధిగా తాగునీరు అందుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్