దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో సోమవారం విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ డీఎస్పీ రమేష్ కుమార్, దేవరకద్ర ఎస్ఐ నాగన్న మాట్లాడుతూ, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వాటి వల్ల శారీరక, మానసిక, సామాజిక సమస్యలు ఎదురవుతాయని, డ్రగ్స్ అలవాటు భవిష్యత్తును నాశనం చేస్తుందని, మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ స్పెషల్ ఆఫీసర్ మహమ్మద్ ఆజాజుల్లా తదితరులు పాల్గొన్నారు.