దేవరకద్ర: కాంగ్రెస్ ప్రభుత్వానివి మోసపూరిత హామీలు: ఆల

1327చూసినవారు
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిందని ఆరోపించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ లో ఆయన పర్యటించారు. అక్కడ మహిళలు ఆయనను కలిసి, కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే వాళ్లను వదులుకొని, దెబ్బలు కొట్టే వాళ్లను తెచ్చుకున్నామని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్