మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామానికి చెందిన రైతు నాగరాజు, తన 10 ఎకరాల పొలంలో నీటి సమస్యను అధిగమించడానికి 130 బోర్లు వేసి విఫలమయ్యారు. ఆదివారం సాయంత్రం స్నేహితుల సహాయంతో 131వ బోరును 70 అడుగుల లోతులో వేయగా, నీరు లభించింది. ఈ నీటితో రాబోయే కాలంలో రెండు పంటలు పండించుకుంటానని రైతు నాగరాజు సంతోషం వ్యక్తం చేశారు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని ఆయన నిరూపించారు.