దేవరకద్ర: అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

28చూసినవారు
దేవరకద్ర: అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామ శివారులోని ఊకచెట్టు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా డ్రైవర్ ఉపేంద్రను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్ ను తహశీల్దారుకు అప్పగించారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్