మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి మంగళవారం హాజరైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ సచిన్ సావంత్ లకు భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు వారికి ఆహ్వానం పలికారు.