దేవరకద్ర: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. పోలీసులకు ఫిర్యాదు

278చూసినవారు
దేవరకద్ర: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. పోలీసులకు ఫిర్యాదు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో దీపిక సంతకాన్ని వెంకటేష్ యాదవ్ అనే యువకుడు లోన్ కోసం ఫోర్జరీ చేశాడు. తప్పుడు సంతకాన్ని బ్యాంకు అధికారులు గుర్తించి ఎమ్మార్వోకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన బుధవారం కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్