దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికలు... పోలీసుల ఫ్లాగ్ మార్చ్

219చూసినవారు
దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికలు... పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. భూత్పూర్ మునిసిపాలిటీ పరిధిలో అదనపు ఎస్పీ ఎన్. బి. రత్నం ఆధ్వర్యంలో భూత్పూర్ టౌన్లో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకున్న ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్