దేవరకద్ర: రైల్వే సబ్ వే మంజూరులో నా కృషి కీలకం: ఎమ్మెల్యే

62చూసినవారు
దేవరకద్ర: రైల్వే సబ్ వే మంజూరులో నా కృషి కీలకం: ఎమ్మెల్యే
దేవరకద్ర మున్సిపాలిటీలో ఆర్వోబీ బ్రిడ్జి వల్ల రైల్వే గేట్ మూసివేయడంతో పట్టణం రెండుగా చీలి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే సబ్వే మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తన నిరంతర ప్రయత్నాలే కారణమని తెలిపారు. ఆయన 2024 మార్చి 12న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వగా, 2024 నవంబర్ 18న రైల్వే శాఖ సబ్వేకు అనుకూలమని లేఖ ఇచ్చింది. అయినప్పటికీ ఆలస్యం జరగడంతో, 2025 అక్టోబర్ 14న మరోసారి రైల్వే అధికారులను కలిసి ప్రజల ఇబ్బందులను వివరించడంతో చివరకు సబ్వే మంజూరు అయిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్