దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.