దేవరకద్ర: 'మహిళ సంఘాల' చేతికి 'సోలార్ పవర్': ఎమ్మెల్యే

319చూసినవారు
దేవరకద్ర: 'మహిళ సంఘాల' చేతికి 'సోలార్ పవర్': ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహిళలను కేవలం చిన్న వ్యాపారాలకే పరిమితం చేయకుండా, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులను మహిళా సంఘాలకు కేటాయించిందని తెలిపారు. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, అనుమతులు, పెట్టుబడికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని, ప్లాంట్ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా మహిళా సంఘాల సభ్యులకే చేరుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్