మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్తాయపల్లిలో ఆదివారం రాత్రి భర్త నాగేశ్ (38)ను భార్య కవిత హత్య చేసింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి నాగేశ్ మద్యం తాగి ఇంటికి రాగా, మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో చిన్న కొడుకు రాము చూస్తుండగానే కవిత భర్తపై కత్తితో దాడి చేసింది. చికిత్స పొందుతూ నాగేశ్ సోమవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.