దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గురువారం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో నిర్వహించిన దమగ్నాపూర్ ప్రీమియర్ లీగ్ (DPL) క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆయన బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.