మహబూబ్ నగర్: కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్ లు అందజేత

70చూసినవారు
మహబూబ్ నగర్: కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్ లు అందజేత
మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ లను ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం అందజేశారు. సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్ పూర్ నియోజకవర్గాల అభ్యర్థులకు ఈ బీ-ఫామ్ లను పంపిణీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్