మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం సల్గోనిపల్లి పలుగు తాండ మధ్య 1.66 కోట్ల రూపాయల వ్యయంతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తుందని, ప్రాంతాల అభివృద్ధికి నూతన రోడ్లు కీలకమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.