మహబూబ్ నగర్: ఫుడ్ పాయిజనింగ్... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

517చూసినవారు
మహబూబ్ నగర్: ఫుడ్ పాయిజనింగ్... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్ నగర్ జిల్లాలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజలను అప్రమత్తం చేశారు. శుభకార్యాలు, విందుల్లో మిగిలిపోయిన ఆహారాన్ని తినే ముందు దాని నాణ్యత, తాజాదనం, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ ఘటనల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్