మహబూబ్ నగర్: అంతర్రాష్ట్ర చెక్కుల దొంగ అరెస్ట్
By KOTLA SRINIVASA REDDY 1234చూసినవారుశనివారం మహబూబ్ నగర్ టూటౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్థుడు డి. సిద్ధేష్ (కర్నూలు)ను అరెస్ట్ చేశారు. బ్యాంకుల్లో వృద్ధులను నమ్మించి చెక్కులు దొంగిలిస్తున్న నిందితుడు, ఒక వృద్ధుడి చెక్కుతో రూ. 90 వేలు, గతంలో రూ. 50 వేలు కాజేసినట్లు తేలింది. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 16 కేసులు నమోదయ్యాయి. కేసును ఛేదించిన ఎస్ఐ విజయభాస్కర్ బృందాన్ని ఎస్పీ డి. జానకి అభినందించారు. బ్యాంకుల్లో అపరిచితులను నమ్మి మోసపోవద్దని ఎస్పీ ప్రజలకు సూచించారు.