మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో సోమవారం పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని, పిల్లలు, మహిళలపై జరిగే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.