మహబూబ్ నగర్ జిల్లా జమిస్తాపూర్ లో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్. నాగయ్య కుమారుడు లక్ష్మయ్య (43) శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి మృతి చెందాడు. శనివారం అతని మృతదేహం చెరువులో లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.