మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం మంగంపేట తండాకు చెందిన సభావత్ మల్లేష్, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మరణంతో మంగంపేట తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.