రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ రంగం ఎంతో కీలకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో రూ. 52. 56 లక్షల వ్యయంతో నిర్మించనున్న TGSPDCL, విజిలెన్స్ భవనాల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. పారిశ్రామికంగా రాష్ట్రం మరింత పురోగమించాలంటే విద్యుత్ ఎంతో అత్యవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.