మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహులను హెచ్చరించారు. పార్టీ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో సానుకూల ఫలితాలు వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తామని, పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని, పార్టీ లైన్ దాటవద్దని ఆయన సూచించారు.