మహబూబ్ నగర్: ట్రావెల్స్ బస్సు-లారీ ఢీ.. 8 మందికి గాయాలు

1155చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ ధర్మపూర్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దేవరకద్ర, మహబూబ్ నగర్ అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్