మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, యువతే వికసిత్ భారత్ కు పునాది అని పేర్కొన్నారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో "మేరా యువ భారత్ వికసిత్ భారత్-2047" కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎఎన్ఎస్ఎస్ సెమినార్ (కాన్స్లేవ్)లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు సమాజసేవలో ముందుండాలని, భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ఆమె సూచించారు.