మహబూబ్ నగర్ జిల్లా 16వ డివిజన్ బోయపల్లిలో ఆదివారం శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొననున్నారు. నిన్న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్నప్పటికీ, అలసిపోయినా విగ్రహావిష్కరణకు వస్తున్నట్లు రాజాసింగ్ తెలిపారు. పట్టణ, జిల్లా ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.