మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని భూత్పూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి ఆయన చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.