ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

646చూసినవారు
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి
దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని మూసాపేట్ మండలం వేముల, దాసర్ పల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇళ్ల మంజూరుతో ఎంతో మంది పేదల కలలు నిజమయ్యాయి.

సంబంధిత పోస్ట్