పాలమూరు: మాకు అబద్ధాలు, మోసాలు చేయడం రాదు: డీకే అరుణ

100చూసినవారు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శనివారం దేవరకద్రలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేవరకద్ర నూతన మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో, మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేశారని తెలిపారు. తమకు అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం రాదని స్పష్టం చేశారు. రైల్వే గేటు సమస్యను పరిష్కరించి, ప్రజల సౌకర్యార్థం వంతెన నిర్మిస్తున్నామని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, కేంద్ర నిధులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంపీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్