మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ప్రధాని మోదీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని ఎంపీ డీకే అరుణ బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, ప్రతి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేయాలని ఆమె ప్రజలను కోరారు. ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి పాలమూరు జిల్లాకు భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే దిశగా ప్రజలకు అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.