ఆధార్ సెంటర్ లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

254చూసినవారు
ఆధార్ సెంటర్ లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
గణేష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధార్ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు, సవరణలు ఉన్నా ఎలాంటి సందేహం లేకుండా ఈ కేంద్రంలో సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆధార్ మన గుర్తింపు అని, దాని ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్