కౌకుంట్లలో వైభవంగా ఏరువాక ఉత్సవాలు

1352చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జేష్ట మాసం పౌర్ణమి సందర్భంగా స్థానిక శివాలయంలో రైతులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం, రైతులు తమ ఎడ్లను అలంకరించి, ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి, ఏరువాక తాడును తెంచారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్