Mar 16, 2026, 18:03 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
Mar 16, 2026, 18:03 IST
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రోజంతా ఎండతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని గాలులు వీయడంతో పాటు వర్షం పడటంతో ఉపశమనం లభించింది. దీంతో మండల కేంద్రంలో వాతావరణం చల్లబడింది.