అలంపూర్: బ్రహ్మేశ్వర స్వామి హుండీ లెక్కింపు

401చూసినవారు
అలంపూర్: బ్రహ్మేశ్వర స్వామి హుండీ లెక్కింపు
జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో అన్నదాన సత్రం హుండీ ద్వారా 5,24,77,093 రూపాయలు, శ్రీ స్వామి వారి హుండీ ద్వారా 5,2,19,210 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు విదేశీ కరెన్సీ అయిన US డాలర్లు 8, ఆస్ట్రేలియా డాలర్లు 20, కెనడా డాలర్లు 10, మిశ్రమ బంగారం 100 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 20 గ్రాములు, 500 మిల్లీ గ్రాములు సమకూరింది. మహబూబ్ నగర్ జిల్లా సహాయ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దీప్తి, అర్చకులు, సిబ్బంది, వివిధ సేవా సంస్థల సభ్యులు, భక్తులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అలంపూర్ బ్రాంచ్ మేనేజర్ భీమా నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్