అలంపూర్: మున్సిపల్ బరిలో భార్యాభర్తలు..!

1216చూసినవారు
అలంపూర్: మున్సిపల్ బరిలో భార్యాభర్తలు..!
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్ మేకల అనిత 13వ వార్డు నుంచి, ఆమె భర్త రైతు సంఘం నాయకుడు మేకల నాగిరెడ్డి 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఒకే పార్టీ నుంచి పక్కపక్క వార్డుల్లో భార్యాభర్తలు పోటీ చేయడం అయిజ పట్టణంలో ఆసక్తికరంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్