జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం తుంగభద్ర నదిలో గురువారం ఇసుక అక్రమ రవాణా చేసేందుకు వెళ్లిన ట్రాక్టర్ ను పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే పారిపోయాడని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.