అలంపూర్: పుల్లూరు బస్టాండ్ లో వ్యక్తి మృతి

757చూసినవారు
అలంపూర్: పుల్లూరు బస్టాండ్ లో వ్యక్తి మృతి
మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు బస్టాండ్ లో సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆకలి, అనారోగ్యం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670284 నంబర్ కు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్