అలంపూర్: రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందజేయాలి

38చూసినవారు
అలంపూర్: రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందజేయాలి
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా, నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ మరియు ఈ-కేవైసీ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని, మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సర్టిఫికెట్లను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన జారీ చేయాలని తెలిపారు. ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును బాధ్యతగా తీసుకొని, సమయానికి వాటిని పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్