అలంపూర్: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్లు జైలు

29చూసినవారు
అలంపూర్: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్లు జైలు
జోగులాంబ గద్వాల జిల్లా పోక్సో కోర్టు, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పింజరి పెద్ద హుస్సేన్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. అలంపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు 2021లో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా, అలంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్