జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన రైతు రంగన్నకు చెందిన ఆరు ఎకరాల చెరుకు తోట బుధవారం అగ్నిప్రమాదంలో కాలిపోయింది. మొక్కజొన్న పొలంలో చెత్త తగులబెట్టగా మంటలు వ్యాపించి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. మొదటి పంట కోసి, రెండో పంటకు సిద్ధమవుతున్న తరుణంలో జరిగిన ఈ సంఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయి కన్నీరుమున్నీరయ్యారు.