తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆరోపణల్లో నిజం లేదని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వాన్ని రాజకీయ లబ్ధికోసం హననం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, క్రిశాంక్, నమస్తే తెలంగాణ దినపత్రిక, యూట్యూబ్ ఛానల్ తెలుగు స్కెబ్ పై నార్సింగి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో తనపై అసత్య ఆరోపణలు ప్రచారం అవుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.