జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహులు (28) ఈ నెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.