జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మాజీ ఎంపీపీ వై. సత్యారెడ్డి తన సొంత ఖర్చులతో విద్యార్థుల కోసం ఐదు లక్షల వ్యయంతో స్టేజి నిర్మాణానికి భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ వేదిక సాంస్కృతిక కార్యక్రమాలకు, సభలకు ఉపయోగపడుతుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని, బిజ్వారం పాఠశాలను మండలంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.