జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాలను బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తి, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు అలంపూర్ దేవాలయాల విశిష్టతను వివరించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం పెంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.