జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామ శివారులో మంగళవారం కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ. 7300 నగదుతో పాటు ఆరగిద్దకు చెందిన బీమన్న, రంగన్న, తుమ్మలపల్లికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఒక కోడిపుంజును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు.